'కృష్ణం వందే జగద్గురుమ్' విడుదల ఎప్పుడంటే..
దగ్గుబాటి రానా,నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈచిత్రాన్నిదసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు క్రిష్ చెప్తున్నారు. ఆయన ఈ విషయమై మీడియాతోమాట్లాడుతూ...''సమాజం లోంచి అల్లుకొన్న కథ ఇది. సమకాలీన అంశాలు తెరపైన కనిపిస్తాయి. వినోదం జోడించడంమర్చిపోలేదు. బీటెక్ బాబు,దేవిక పాత్రలు ప్రేక్షకులకు చేరువవుతాయి. దసరాకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం రాజధానిలో పాటల చిత్రీకరణ జరుగుతోంది.ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్ని నిర్మించారు.
No comments:
Post a Comment