పవన్ కోసమా దిల్ రాజు ఆ టైటిల్ ని....?
పవన్ కళ్యాణ్,దిల్ రాజు కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పెద్దపెద్ద స్టార్స్ తో సినిమాలు చేసినా దిల్ రాజుకు ఇప్పటికీ పవన్ డేట్స్ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా పవన్ ...దిల్ రాజుకి ఓచిత్రం చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. దాంతో దిల్ రాజు ఈ జనగణమణ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లోవినపడుతోంది. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. పవన్ తో చేయబోయే చిత్రం తమిళ,హిందీ,తెలుగుభాషల్లో చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుసమాచారం.
ఇక జనగణమణ టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయగానే అంతా ఎన్టీఆర్,హరీష్ శంకర్ చిత్రం కోసం అని భావించారు. అయితే దిల్రాజు అలాంటిది ఏమీ లేదని మరుసటి రోజు వివరణ ఇచ్చారు.
No comments:
Post a Comment