పూరీనా మజాకా! ఆగలేక పోతున్న అల్లు అర్జున్
దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక్కసారి కథ చెబితే చాలు ఎంత పెద్ద టాప్ హీరో అయినా ఒకే దెబ్బకు ఓకే అనాల్సిందే. రెండో సారిపూరితో సినిమా చేసే హీరోలు ఆయనపై నమ్మకంతో కథ వినకుండానే ఓకే చెప్పేస్తారు. ఆ రేంజిలో ఉంటుంది హీరోలకు పూరీస్టోరీ వివరించే తీరు. ఒక్కసారి పూరి ఒక కథ పట్టుకుని హీరో దగ్గరి వెళ్లాడంటే ఓకే కావాల్సిందే. ఎందుకంటే ఏ హీరో ఇమేజ్కు తగిన విధంగా ఆ సబ్జెక్టును రెడీ చేసుకోవడం పూరి స్టైల్. హిట్టా? ప్లాపా? అనేది వేరే విషయం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ ఈ చిత్రం తర్వాత బన్నీతో‘ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేయబోతున్నాడు.

No comments:
Post a Comment