నిత్యా మీనన్ తో గోవాలో నారా రోహిత్
సోలో' సినిమా ద్వారా మంచి విజయం సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్ 'ఒక్కడినే' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.జెనిలియాతో ‘కథ' చిత్రం చేసిన శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లవ్, యాక్షన్ నేపధ్యంలోతెరకెక్కుతోంది. గుళాబీ మూవీస్ పతాకంపై నిర్మాత సి.వి.రెడ్డి నిర్మిస్తున్నారు.
ఒక్కపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత వివరిస్తూ - మిగిలిన ఒక్క పాటను గోవాలోచిత్రీకరణ చేస్తున్నట్టు తెలిపారు. మా చిత్రం కోసం షూటింగ్ చేయాల్సిన డ్యూయెట్ సాంగ్ని గోవాలోని సుందర ప్రదేశాలలో నారారోహిత్ - నిత్యామీనన్లపై చిత్రీకరించడం జరిగింది. ఈ పాట చిత్రీకరణతో నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

No comments:
Post a Comment