ఫ్యామిలీతో రాజమౌళి గోవా ట్రిప్
రెండు సంవత్సరాల పాటు ‘ఈగ' చిత్రం కోసం ఎడతెరిపి లేకుండా పని చేసిన రాజమౌళి ఎట్టకేలకు ఫ్రీ అయ్యారు. ఈగ చిత్రంవిడుదలై మంచి విజయం సాధించడం, ప్రమోషన్స్ కూడా ముగియడంతో రాజమౌళి ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారు.ఈ మేరకు ఆయన మంగళవారం గోవా బయల్దేరి వెళ్లారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడిస్తూ...రెండు సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ హాలిడే తీసుకుంటున్నా,మరో వారం రోజులవరకు ట్విట్టర్లో అందుబాటులో ఉండక పోవచ్చు అని రాజమౌళి ట్విట్ చేశారు.

No comments:
Post a Comment