'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' స్పూర్తి ఏమిటంటే...: శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం కథకు స్ఫూర్తినిచ్చిన విషయం గురించిచెప్తూ...'హ్యాపీడేస్' తో నాలుగు జంటల కళాశాల జీవితాల్ని చూపించాను. మరి ఇళ్ల దగ్గర అలాంటి అందమైన జీవితం ఉంటేఎలా ఉంటుందని ఆలోచించినప్పుడు స్ఫురించిన కథే ఇది. కాలనీలోని ఇరుగుపొరుగుతో కష్టసుఖాల్ని పంచుకొనే పెద్దలు..అంతా కలిసి చేసుకొనే పండగలు, మరోపక్క పిల్లల గోలీలాట, కాగితపు పడవలు, గల్లీ క్రికెట్టు... ఇలాంటివన్నీ రుచి చూస్తే ఎవరిజీవితమైనా అందంగా మారిపోతుందని చెబుతున్నాం. ఆశలు, ఆకాంక్షలు, రొమాన్స్, భావుకత, గందరగోళం,లక్ష్యాలు..ఇవన్నీ కలగలిసిన చిత్రమిది.

No comments:
Post a Comment