'శ్రీమన్నారాయణ' స్టోరీ లైన్ ఏంటి?
బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ'. ఈ నెల చివరి వారంలో విడుదలకుసిద్దమువుతున్నఈ చిత్రం ప్రమోషన్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టుగా కనిపించనున్నారు.ఈ చిత్రం స్టోరీలైన్ఏమిటంటే.. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు. కనీసం పదిమందికైనా స్ఫూర్తి నింపాలనేది శ్రీమన్నారాయణ ఆశయం. అందుకే పాత్రికేయ రంగాన్ని ఎంచుకొన్నాడు. అన్యాయాలను తనదైన శైలిలో ఎదుర్కొన్నాడు. అయితే ఈ ప్రయాణంఅనుకొన్నంత సులభం కాలేదు. అయినా సరే... సమాజంలోని కలుపు మొక్కల్ని ఏరిపారేయడమే లక్ష్యంగా ముందుకుసాగాడు. ఈ పోరాటంలో అతను ఏ రీతిన నెగ్గాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

No comments:
Post a Comment