బాలకృష్ణతో డైరక్టర్ తేజ చిత్రం..టైటిల్ ??
అప్పట్లో తేజ తాను ఫామ్ లో ఉన్నప్పుడు రజనీకాంత్ తో రైతు అనే చిత్రం చేస్తానని ప్రకటించాడు. అయితే ఆ తర్వాత వరసప్లాపుల సుడిగుండంలో చిక్కుకున్న తేజ దాని ఊసే ఎత్తలేదు. అయితే తాజాగా ఆ టాపిక్ మళ్లీ ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది.దానికి కారణం తేజ మరోసారి ఫిల్మ్ ఛాంబర్ లో రైతు..ద వారియర్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించటం. దాంతో ఈ చిత్రం స్కిప్టుఇప్పుడు బయిటకు తీసి,ప్రస్తుత రాజకీయ నేఫద్యంలో వండుతున్నాడని వినిపిస్తోంది.అయితే హీరో ఎవరూ ఏమిటనేది మాత్రంతెలియరాలేదు.
ఇక ఆ మధ్యన నీకు నాకు డాష్ డాష్ చిత్రం డిజాస్టర్ అయ్యాక దగ్గుపాటి రానాతో చిత్రం చేస్తాడని అంతా భావించారు. ఆమేరకు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా బాలకృష్ణతో తేజ ఈ చిత్రం చేయనున్నారని వార్తలువినిపిస్తున్నాయి.

No comments:
Post a Comment