పిచ్చెక్కిస్తున్న ‘సుడిగాడు’ తాజా పోస్టర్లు
టాలీవుడ్ సడెన్ స్టార్ అల్లరి నరేష్ తన తాజా సినిమా ‘సుడిగాడు' విడుదలకు ముందు నుంచే ట్రైలర్లతో సంచలనంసృష్టిస్తున్నసంగతి తెలిసిందే. పబ్లిసిటీలో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్స్ విడుదలయిపిచ్చెక్కిస్తున్నాయి.అల్లరి నరేష్కు ఆల్ ఆఫ్రికా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందని, తొలి సారిగా నైజీరియాలో అల్లరి నరేష్ చిత్రంవిడుదలవుతుందంటూ పోస్టర్లు విడుదల చేశారు.
మరో పోస్టర్లో....ప్రపంచ వ్యాప్తంగా ‘సుడిగాడు చిత్రం 1,79,890 థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించడమే కాకుండా,తొలిసారిగా చంద్రమండలంలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం అంటూ ప్రకటించారు.

No comments:
Post a Comment