‘శుభలేఖ రాసుకున్నా ఎదలో..' రీమిక్స్ పై చిరంజీవి
చిరంజీవి ‘కొండవీటి దొంగ' చిత్రంలోని ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..అనే పాటని రామ్ చరణ్ తాజ్ చిత్రంలో రీమిక్స్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాట విషయమై సంగీత దర్శకుడు తమన్ ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రసంసించారని సమాచారం.ఈ పాటని రీమిక్స్ చేయటానికి ఫర్మిషన్ తీసుకున్న తమన్ ..తర్వాత ఈ పాట ఫైనల్ కాపీని చిరంజీవికి వినిపించారు.రిమిక్సెడ్ వెర్షన్ ని విన్న చాలా ప్రసంశించారని తమన్ చెప్తున్నారు.
కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ లో కనిపంచనుంది. డివీవీ దానయ్యయూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నఈ మూవీ షూటింగ్ ఇటీవలే కోల్కత్తాలో పూర్తయింది.

No comments:
Post a Comment