రాక్షసి దర్శకుడితో జూ ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంద్వారా దర్శకుడిగా పరిచయం అయిన హనుతో ఓ టాప్ నిర్మాత ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఇందులో జూ ఎన్టీఆర్ హీరోగాచేయనున్నట్లు సమాచారం.
హను రాఘవపూడి గతంలో రాజమౌళికి అసిస్టెంట్ గా పని చేశారు. యమగొంగ సమయంలోనే హనుతో జూ ఎన్టీఆర్కు పరిచయం ఉంది. హను పని తీరుపై నమ్మకంతోనే జూ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికిసంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

No comments:
Post a Comment