వినాయక చవితికి వెంకీ ‘షాడో’ టీజర్
వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధాన పాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నచిత్రం ‘షాడో'. మెహర్రమేష్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం తొలి టీజర్ ను వినాయక చవితి సందర్భంగావిడుదల చేయనున్నట్లు దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు.
ఇందులో వెంకటేష్ ఇంటర్నేషనల్ డాన్గా కనిపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోనవెంకట్, గోపీ మోహన్లు స్క్రిప్టు అందిస్తున్నారు.హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.

No comments:
Post a Comment