ఆ పాట వింటే రోజంతా ఉత్సాహమే:నాగార్జున
ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి, ఆ రోజంతా ఉల్లాసంగా ఉండటానికి శిరిడీ సాయి చిత్రంలోని ‘అమరరామ....' పాట వింటేచాలు. శిరిడి సాయి పాటలకు లభిస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఉన్న ఇతర పాటలు కూడాచాలా బాగుంటాయి. మంచి పాటలిచ్చినందుకు కీరవాణికి ధన్యవాదాలు'' అన్నారు నాగార్జున. అన్నమయ్య, శ్రీరామదాసుచిత్రాల్లో భక్తునిగా నటించిన నాగార్జున ‘శిరిడి సాయి'లో భగవంతుడిగా కనిపించబోతున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోసాయికృప ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి సులోచనారెడ్డి సమర్పణలో ఎ.మహేష్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

No comments:
Post a Comment