24న బ్రహ్మానందం కుమారుడు వివాహం
పల్లకీలో పెళ్లి కొడుకు చిత్రంతో పరిచయమైన బ్రహ్మానదం కుమారుడు గౌతమ్ త్వరలో ఓ ఇంటివాడుకాబోతున్నాడు. సినిమాటోగ్రాఫర్ మరియు నిర్మాత శ్రీనివాస రెడ్డి కుమార్తెని వివాహం చేసుకోబోతున్నాడు. వీరిది ప్రేమవివాహం అని తెలుస్తోంది. హైదరాబాద్ లోని HICC(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్) లో ఈ నెల 24న ఘనంగాఈ వివాహం జరగనుంది. ఇరు వైపులకు చెందిన వారు సినిమా వారే కావటంతో ఈ వివాహానికి సినిమా వారు చాలా మందిహాజరుకానున్నారు.ఇప్పటికే ఈ మేరకు ఆహ్వానాలు జరుగుతన్నాయని సమాచారం.
No comments:
Post a Comment