సోషియో ఫాంటసీ చిత్రాల్లో కొత్తగా ఉండే దేవుడు చేసిన మనుషులు
‘‘రవితేజ తోనాకిది మూడో సినిమా. ఈ పాతికేళ్లలో నాకు బాగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదంటే రవితేజతో నేను తీసిన‘ఈ అబ్బాయి చాలా మంచోడు’. ఆ తర్వాత ‘ఖతర్నాక్’ సినిమా. ఇప్పుడేమో దేవుడు చేసిన మనుషులు. ఇది తప్పకహిట్టవుతుంది. నా జడ్జిమెంట్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు’’ అని నిర్మాత బీవీయస్యన్ ప్రసాద్ చెప్పారు. రవితేజ, ఇలియానజంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రసాద్ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ బుధవారం ప్రేక్షకుల ముందుకురానుంది.