Friday, 28 September 2012


అజయ్ దేవగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు: రాజమౌళి

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఈగ' చిత్రాన్ని హిందీలో ‘మక్కి' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 ‘మక్కి' చిత్రం బాలీవుడ్లో విడుదలువతోంది.లేటెస్ట్‌గా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘మక్కి'చిత్రం ఓపెనింగ్ సీన్‌కు వాయిస్ ఇవ్వడానికి ఓప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు.

తెలుగులో ‘ఈగ' సినిమా మొదలు కాగానే బ్యాగ్రౌండ్‌లో రాజమౌళి వాయిస్ ఓ పాపకు కథ చెబుతూ టైటిల్స్ స్టార్ట్ అవుతాయి.



సిక్స్ ప్యాక్ కథాశంతో కృష్ణుడు...‘మిస్టర్ మన్మథ’

కృష్ణుడు,సోనియా హీరో హీరోయిన్లుగా ‘మిస్టర్ మన్మథ' చిత్రం మొదలైంది. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రాన్ని మల్లెల సీతారామరాజు, గుండ్లకుంట శ్రీరాములు హరిత ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

తాజాగా బుధవారం ఈచిత్రం ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. సి కళ్యాణ్ పూజ ప్రారంభించగా, ప్రసన్నకుమార్ స్ర్కిప్టు ప్రతులు దర్శకుడికి అందించారు. 



ఎన్టీఆర్ ‘బాద్ షా’లో ఫారిన్ ఫైట్ మాస్టర్స్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న ‘బాద్ షా' ఫస్ట్ టీజర్ ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజును పురస్కరించుకున ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులోముఖ్యంగా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.

ఈ నేపథ్యంలో ‘బాద్ షా' చిత్ర దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం ఫారిన్ ఫైట్ మాస్టర్స్‌ను తీసుకొచ్చి భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్చేయబోతున్నట్లు తెలుస్తోంది

My Zimbio
Top Stories