Friday, 23 November 2012


డమరుకం రివ్యూ


వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్న నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' ఈ రోజు విడుదల అవుతోంది.‘నాగార్జున హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘డమరుకం' చిత్రం కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూ. 40 కోట్లు ఖర్చు చేసి ఈచిత్రాన్ని నిర్మించారు. నాగార్జున అయితే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని, ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని చెప్తూ వస్తున్నారు.

Thursday, 22 November 2012


బాలకృష్ణ 100వ చిత్రానికి దర్శకుడు ఖరారు?

ఇటీవల వచ్చిన 'శ్రీమన్నారాయణ' చిత్రం బాలకృష్ణకు 97వ చిత్రం. మరో రెండు చిత్రాలు చేస్తే వందవ చిత్రం ముంగిట్లోకివచ్చేసినట్లే. ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు.. ఎవరు నిర్మిస్తారు.. అనే విషయమై గత కొంతకాలంగా చిత్రసీమలోచర్చ జరుగుతోంది. అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లే అని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి సూర్య ప్రకాష్ అని తెలుస్తోంది.



సిద్ధార్థ, సమంత, నందినీరెడ్డి మూవీ టైటిల్ అదేనా?

సిద్దార్థ-సమంత జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచివినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి ‘జబర్‌దస్త్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికసమాచారం వెలువడాల్సి ఉంది.

ఈ చిత్రానికి బేస్ లవ్ స్టోరీనే అయినప్పటికీ...పూర్తిగా ఫన్నీగా సాగేలా దర్శకురాలు స్ర్కిప్టు రెడీ చేసారు.


My Zimbio
Top Stories