Tuesday, 30 October 2012


'బాద్‌షా' లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్

మన సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్స్ అంటే ఓ రేంజిలో దుమ్ము రేపే ఫైట్ సీన్ ఉండాల్సిందే. హీరో వస్తూ వస్తూ విలన్స్ నుచితగ్గొట్టే... కార్యక్రమంలో దిగిపోతే అభిమానులకూ ఆనందం. ప్రస్తుతం ఎన్టీఆర్ తాజా చిత్రం 'బాద్‌షా' కోసం అలాంటి ఘట్టాన్నేతెరకెక్కిస్తున్నారు.కాజల్‌ హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత.ప్రస్తుతంహైదరాబాద్‌లో విజయన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ పై ఫైట్ తెరకెక్కిస్తున్నారు.ఇందుకోసం ఓ భారీ సెట్‌ని నిర్మించారు.



గ్రామీణ విలేకరి ఇతివృత్తంతో సినిమా

 నిజాయతీ, అంకితభావంతో పని చేసే ఒక గ్రామీణ విలేకరి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న'రిపోర్టర్‌' చిత్రంలో నటిస్తున్నానని 'నంది'అవార్డు గ్రహీత, గంగపుత్రులు హీరో రాంకీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలోఈ చిత్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో రిపోర్టర్‌ చిత్ర దర్శకులు,హీరో, హీరోయిన్మీడియా సమావేశంనిర్వహించి చిత్ర విశేషాలు తెలియచేసారు.


మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా, అరెస్ట్

సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు ఇంటి ముందు బ్రహ్మాణులు సోమవారం ధర్నా చేసారు. మంచు విష్ణు హీరోగా రూపొందిన‘దేనికైనా రెడీ' చిత్రంలో బ్రహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్చేసారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.


'ఎ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' ని సమర్ధిస్తూ మంచు లక్ష్మి ప్రసన్న?

అన్నిచోట్ల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్న చిత్రం 'ఎ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం'. ఈ చిత్రంపై సిని ప్రముఖులు ఎవరూ కామెంట్చేయటానికి కూడా ఆసక్తి చూపటం లేదు. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మి కామెంట్ అంటూ ఓ వార్త నెట్ లో హల్ చెల్ చేస్తోంది.ఆ వార్తలో...ఆమె 'ఎ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' ప్రోమోలో తప్పు లేదని చెప్పినట్లుగా ఉంది. మరో ప్రక్క 'ఎ ఉమెన్‌ ఇన్‌బ్రాహ్మణిజం' సినిమాను తక్షణం రద్దు చేయాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి.


My Zimbio
Top Stories