సమంత 'ఎటో వెళ్లి పోయింది మనస్సు' రిలీజ్ డేట్ ఖరారు
'ఎటో వెళ్లి పోయింది మనస్సు' ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని,సమంత కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. తొలుత దీపావళి కానుకగా జనం చెంతకు తెస్తారని భావించారు. అయితే సమయం తక్కువగా ఉండటం, విడుదలపై ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రేమికుల రోజు కానుకగా రానున్న ఫిబ్రవరి 14న థియేటర్లలోకి తెస్తారనే వార్తలు షికార్లు చేశాయి. అయితే దీనిని డిసెంబర్ 14న విడుదల చేస్తున్నట్లు వినికిడి. అధికారక ప్రకటన లేకున్నా.. విశ్వసనీయ వర్గాలు మాత్రం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
No comments:
Post a Comment