పవన్ ఎఫెక్ట్ తో నాగార్జున సినిమా వెనక్కి
పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు', నాగార్జున ఢమురకం చిత్రాలు ఒకదానికి మరొకటి పోటీపడుతాయనే వార్తలు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. దసరా సెలవులను క్యాష్ చేసుకోవటానికి రెండు చిత్రాలు ఒక రోజుతేడాలో రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. అయితే ఇప్పుడు నాగార్జున సినిమా వెనక్కి తగ్గిందని సమాచారం. అక్టోబర్ 12 అనుకున్నఈ తేదీని అక్టోబర్ 18కి మార్చినట్లు తెలుస్తోంది. భాక్సాఫీస్ వద్ద ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' రిజల్ట్ ని బట్టి ఆ డేట్ మరింతముందుకు వెళ్తుందా లేదా అని తేలుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
No comments:
Post a Comment