Monday, 27 August 2012


నాగచైతన్యతో శృతి హాసన్ రొమాన్స్

‘గబ్బర్ సింగ్' చిత్రం తర్వాత హీరోయిన్ శృతి హాసన్‌కు అవకాశాలు బాగానే వస్తాయని ఆశించారంతా. అయితే అంచనాలుతలక్రిందులయ్యాయి. ఈ హిట్ ఆమె కెరీర్‌కిపెద్దగా ప్లస్సవ్వలేదనే చెప్పాలి. కారణం ఈ చిత్రంలో శృతి హాసన్ పాత్ర కేవలంపాటలకు మాత్రమే పరిమితం కావడం. దీంతో యాక్టింగ్‌కు స్కోప్ లేకుండా పోయింది.

తాజాగా శృతి హాసన్ నాగచైతన్య సరసన హీరోయిన్‍గా ఎంపికైంది. వీరూ పొట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోదీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ కామిడీ అంశాలతో రూపొందే ఈ చిత్రం అక్టోబర్లోప్రారంభం కానుంది. రగడ చిత్రం నిర్మించిన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories