పవన్ కళ్యాణ్ డైరక్టర్ తో రానా దగ్గుపాటి ఖరారు
వరసప్లాప్ లతో దూసుకుపోతున్న హీరో దగ్గుపాటి రానా మరో కొత్త చిత్రం కమిటయ్యాడని సమాచారం. పవన్ కళ్యాణ్ తోగతంలో పంజా చిత్రం రూపొందించిన విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం కొత్తగా సైన్ చేసాడని తెలుస్తోంది. రీసెంట్ గా విష్ణువర్ధన్ డైరక్షన్ లో రూపొందుతున్న చిత్రంలో గెస్ట్ రోల్ చేసిన రానా ఆయన్ని ఇంప్రెస్ చేసి ఈ ఛాన్స్ సాధించాడని తెలుస్తోంది. ఈమేరకు తమిళ పత్రికలు కథనాలు ప్రచురించాయి. అజిత్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో రానా గెస్ట్ రోల్ చేస్తున్నారు.
ఈ గెస్ట్ రోల్ విషయమై రానా "ముంబై వచ్చాను..చాలా గ్యాప్ తర్వాత...ఇక్కడ అజిత్, విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో రూపొందేచిత్రంలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాను. అదో తమిళ చిత్రం. ముంబైలో తమిళం" అంటూ ట్వీట్ చేసారు.
No comments:
Post a Comment