హాలీవుడ్లో ఎస్వీ కృష్ణారెడ్డి డివోర్స్ ఇన్విటేషన్
ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్లో కొత్త మజిలీ మొదలైంది. దర్శకునిగా తన 19 ఏళ్ల కెరీర్లో ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ మొదలుకుని‘మస్త్’ వరకూ 38 చిత్రాలు డెరైక్ట్ చేసిన ఎస్వీకె హాలీవుడ్లోఅడుగుపెట్టారు. డివోర్స్ ఇన్విటేషన్ పేరుతో ఆయన హాలీవుడ్లో చేసిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.గత 2, 3 ఏళ్లుగా ఆయన ఈ సినిమా నిర్మాణంలోనే తలమునకలై ఉన్నారు.తెలుగులో హంగామా, సామాన్యుడు, డాన్ శీను, బిజినెస్ మేన్ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థగాఎదిగిన ఆర్.ఆర్.మూవీమేకర్స్ సంస్థ ఈ ‘డివోర్స్ ఇన్విటేషన్’ ను నిర్మించడం విశేషం.
No comments:
Post a Comment