రామ్ చరణ్ 'ఎవడు' రిలీజ్ డేట్
రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రం ఏప్రియల్ 5,2013నవిడుదల చేయటానికి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజునే ఎంపిక చేయటానికి కారణం దిల్ రాజు ప్రారంభరోజుల్లో నిర్మించిన దిల్ విడుదలైన రోజు అది. నితిన్ హీరోగా చేసిన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దాంతో సెంటిమెంట్ గా ఆరోజు అయితే బావుంటుందని నిర్ణంయించినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. సమంతతో పాటు సెకండ్ హీరోయిన్గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ను కూడా ఎంపిక చేశారు.
No comments:
Post a Comment