Wednesday, 17 October 2012


అల్లరి నరేష్ చిత్రం ఆడియోకి చిరంజీవి గెస్ట్

అల్లరి నరేష్ తాజా చిత్రం 'యుముడికి మొగుడు'. ఈ చిత్రం టైటిల్ తో గతంలో చిరంజీవి హీరోగా చిత్రం వచ్చి విజయవంతంఅయ్యింది. ఆ సెంటిమెంట్ తోనేమో చిరుని ఈ చిత్రం ఆడియోకి ఆహ్వానిస్తున్నారు. ఈ విషయం నిర్మాత అడ్డాల చంటి ఖరారుచేస్తూ... ''కథ రీత్యా 'యుముడికి మొగుడు' అనే పేరు కుదిరింది. చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమా లోగోని ఆవిష్కరించాం.ఆయన చేతుల మీదుగా పాటల్ని విడుదల చేస్తున్నాం. మిగిలి ఉన్న పాటని స్విట్జర్లాండ్‌లో చిత్రిస్తున్నాము''అన్నారు. వచ్చేనెల మొదటి వారంలో ఆడియోను విడుదల చేయబోతున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories