సూపర్ హిట్ హిందీ రీమేక్ లో నాని ఖరారు
వరసగా పిల్ల జమీందార్,ఈగ చిత్రాల విజయంతో మంచి ఊపు మీద ఉన్న నాని కి మరో మంచి ఆఫర్ వచ్చిందని వినికిడి.హిందీలో సూపర్ హిట్టైన ‘బ్యాండ్ బజా బరాత్' రీమేక్ లో నానికి అవకాసం వచ్చినట్లు కోలీవుడ్ సమాచారం. అనూష్క శర్మహీరోయిన్ గా చేసిన ఆ చిత్రం రెండు సంవత్సరాల క్రితం మంచి విజయం సాధించింది. పంజా దర్శకుడు విష్ణు వర్దన్ అశోశియేట్గోకుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తారు.
No comments:
Post a Comment