Monday, 10 September 2012


తెలుగులో వంద థియేటర్లలో సుదీప్ చిత్రం రిలీజ్

 'ఈగ' చిత్రంలో విలన్‌గా నటించిన సుదీప్ హీరోగా రూపుదిద్దుకున్న 'కిచ్చా' చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. మాతామీడియా పతాకంపై అరిగెల కిశోర్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గురుదత్ దర్శకుడు. 'పక్కా మాస్'ఉపశీర్షిక. ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగిందని, ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని వంద థియేటర్లలో సినిమానువిడుదల చేస్తున్నట్లు నిర్మాత కిశోర్ చెప్పారు. మాస్‌నే కాదు క్లాస్‌ని కూడా ఆకట్టుకొనే సినిమా ఇదని ఆయన తెలిపారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories